ఆనందభైరవి – Annamayya Ananda Bhairavi
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండముండే స్వామిని
సొమ్ములన్నీ కడబెట్టి- సాంపతో గోణముగట్టి
కమ్మని రధంబము కప్పు పన్నీరు
చెమ్మతన వేష్టువలు – రొమ్ముతల మొల జార్జ్
తుమ్మెద మై చాయతోన- నెమ్మటనుండే స్వామిని
పచ్చకప్పరమే నూరి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనరిది అచ్చెరపడిచూడ- అందరికనులకింపై నిచ్ఛమర్ల పూవువలె నిమితానుండే స్వామిని
తట్టుపురుగు కూర్చి- చట్టలు తేరిచి నిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి చట్టముగ మేనునిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని కంటి:
శుక్రవారాభిషేకం స్వామికి విశేషమైన సేవ అన్నమాచార్యుల కాలంలో ఈ సేవ ఇలా జరిగేది. ఆపాదమస్తరం స్వామికి పునుగు తైలపుటర్యంజనం చేసి, కుంకుమ పూవు మొదలైనవాటి మెత్తని వాడులతో నలుగుబెట్టి, పన్నీటితో శుద్ధోదరంతో స్నానమా డించి, తుడిచి, సర్వాంగములు చెమ్మలుఆరగా గద్నూరధూళి చల్లి మేదించి, దానిపైన పచ్చిపట్టగా పునుగు సుగంధతైలం రాచి, ముత్యాల తిరునామము, మంగతాళి మొదలైన దివ్యాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పహారాలూ అలంకరించేవారు.
తిరుమనవేశ అన్నమాచార్యులు స్వామిచెంత నలుగుపాటలు, అభిషేక కీర్తనలు పాడటమూ, అభిషేకానంతరం ఒక అభిషేకపు పన్నీటి చెంబూ, తాంబూల చందనాది సత్కారాలు స్వీకరించడం రివాజ. తిరుమẲనోత్సవం శాశ్వతంగా ఇలా జరుగుటకై అన్నమాచార్యులూ, తత్సుతులూ, స్వామికి కొన్ని అగ్రహారాలు కైంకర్యం చేశారు.
ఈనాడు తిరుమజ్జనోత్తవం ఇలా జరుగుతున్నది. పునుగు తైలంలో అభ్యంజనము, క్షీరఘటాభిషేకము, కుంకునుపువ్వు, కస్తూరి, కర్పూరం కలిపి నూరి బంగారు గిన్నెలలో పల్చగా జేసిన ద్రవ్యంతో నలుగు, స్వల్పంగా ఆరాభిషేకమూ జరుగుతాయి. అనుకు నలుగుతో కలసిన తీర్థం స్వామి పాద తీర్థంగా సేకరించిన తర్వాత విరివిగా జలంతో అభిషేకం జరుగుతుంది. తలతడి అరేటట్లు పాడిబట్ట సిడిచుట్టు కట్టి (పిడప కట్టి) విన్న మంగళ విగ్రహమంతా పొడి బట్టతో తుడిచి ముఖముపై నీటివాతగానూ తక్కిన సర్వాంగములపైనా దూమెరుగుగా పునుగుతైలము పూసి, ముఖమున కర్పూర చూర్ణం తో తిరునామము నాకుతారు. ( కర్పూర చూర్ణమే తిరునామం మళ్లీ వారం తీసివేసిన ప్పుడు శ్రీహరి మహాప్రసాదంగా సేకరించబడి, పంచబడుతుంది. ఆ నామానికి మధ్య వస్తూరి తిలకం దిద్దుతారు.
తిరుమజ్జనోత్సవాన్ని అన్నమాచార్యులు తత్తుతులూ అతి మనోహరంగా అభివర్ణించా రు. అభిషేక దర్శనం చేసిన సమయంలో అన్నమాచార్యులు అవిష్కరించిన ఆనందపు ఉండాల అతిశయపు కీర్తనకంది. శుక్రవారాభిషేక దర్శన భాగ్యం ఈ సంకీర్తనా న వల్ల తప్పక లభిస్తుంది.
ఈ వ్యాఖ్యరు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ‘అన్నమాచార్య చరిత్ర పీఠికా, తాళదార తిరువేంగళనాధుని పరమయోగి విలానమూ, అన్నమాచార్చుని యితర అభిషేక కీర్తన లూ ఆధారాలు వారికి దృతజ్ఞతాపూర్వక నమస్తులు,
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.