గాంధీజీ సూక్తులు ( Gandhiji sukthulu in telugu) Gandhiji sayings in telugu

 గాంధీజీ సూక్తులు

అందం నడవడికలో ఉంటుంది కాని, ఆడంబరాలలో కాదు.

అఖిల ప్రపంచంలో అసలైన అందం మనిషి హృదయంలో పరిమళించే పవిత్రతలోనే ఉంటుంది.

అజేయశక్తి భౌతిక సామర్థ్యం నుంచి గాక, దృఢదీక్ష నుంచి జనిస్తుంది.

_అద్భుతాలను సాధించాలనుకునే వ్యక్తికి అనంతమైన సహనం అవసరం.

అలవాట్లు మానవుణ్ణి కబళిస్తాయి. కనుక ఆలోచించి చెడ్డ అలవాట్ల నుండి మనం తప్పించుకోవాలి.

అన్నం శరీరానికి ఆహారమయినట్లు, జ్ఞానం, చింతన ఆత్మకు ఆహారం.

అభ్యుదయాన్ని సాధించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు. నూతన చరిత్రను సృష్టించాలి.

అభిరుచికి అనువైన విద్య ఉండాలి. విద్యకు అనువైన ఉద్యోగం ఉండాలి.

అవమానాన్ని, క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు.

అసమానత నుంచి హింస, మానవత నుంచి అహింస పుడతాయి.

అసంఖ్యాకులకు అందరాని కలిమిని, సుఖాన్ని నీవు అనుభవించవద్దు. దానిని పట్టుదలతో నిరాకరించడమే ధర్మం.

అసత్యం, హింసవల్ల ఎప్పుడూ శాశ్వతమైన మంచి జరగదని నాకు అనుభవం ద్వారా బోధపడింది.

అస్పృశ్యత ఒక పాపం. నికృష్టమైన నేరం. ఈ పాపాన్ని త్వరగా నిర్మూలించకపోతే అది హిందుమతాన్ని మింగే ప్రమాదముంది.

అహంభావం సమూలంగా నశించడమే నమ్రతకు అర్థం.

అహంభావాన్ని ఆసాంతం అంతమొందించటమే వినయం అవుతుంది.

అహంవల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే ఎంతో దట్టమైనది.

అహింస అనేది సర్వ ప్రాణులకు మేలుకోరే మాతృమూర్తి వంటిది.

అహింస ఎదుట హింసవలెనే, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి.

అహింస నా నమ్మకంలో మొదటి అధ్యాయం. అహింస సద్గుణం వంటిది, హింస అసమర్ధత వంటిది. ఆకలితో ఉన్న వానికి అన్నమే దేవుడు.

అగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపిన వాడే నిజమైన బలశాలి.

ఆశ్చర్యపడటం తత్త్వవేత్తల లక్షణం, తత్త్వశాస్త్రం ఆశ్చర్యంతోనే ప్రారంభమవుతుంది.

ఆత్మకు ఆహారం ప్రార్థన.

ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలలతో అనేకమంది నాయకులయ్యారు.

ఆత్మానుభవంగలవాని వద్ద వాచాలత వుండదు.

ఆత్మోన్నతికి తోడ్పడేదే విద్య.

ఆత్మ శుద్ధిమార్గాన్ని అనుసరించడం అంత సులువు కాదు. పరిపూర్ణ ఆత్మశుద్ధి స్థితికి చేరుకోవాలంటే మనసు, మాట, చేతలలో నిర్మలం, నిరుద్రేకం కావాలి. రాగద్వేషాలకు అతీతులం కావాలి.

ఆత్మశుద్ధి ప్రతి ఒక్కరి జీవితంలోని అన్ని పార్శ్వాలకు సంబంధించింది కావాలి.

ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన ఆత్మ నివసిస్తుంది.

ఆరిన దీపం తిరిగి వెలగదు. గడచిన జీవితం మరలా రాదు.

ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాడు.

ఆచరించడం కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.

ఆచరణగా పరిణమించకపోతే ఆలోచనలకు పరిపూర్ణత్వం సిద్ధించదు. ఆచరణ మానవుని ఆలోచనలకు హద్దులేర్పరుస్తుంది.

ఆజ్ఞాపించే ముందు నీవు ఆచరించు.

ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తుల వల్ల సమాజానికి చెడు కలుగుతుంది.

ఇతరులు చేసే మంచి పనులను పెద్దజేసి, చెడ్డపనులను తగ్గించి చెప్పాలి.

ఇతరులకు ఏమి చెపుతావో అది నువ్వు ఆచరించగలిగితేనే మరొకరికి చెప్పు.

ఇతరులపై ఆధారపడి జీవించేవారు వ్యర్థులు.

ఇచ్చింది మరచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపక ముంచుకోవడమే స్నేహం.

ఇతరుల కంటే నేనెక్కువ అనేవాడు పతనాన్ని పొందుతాడు. నేనందరికంటే తక్కువ అనుకునేవాడు ఉన్నతిని పొందగలడు.

ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడంకన్నా, దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు.

ఈ రోజు చేయవలసింది రేపు చేద్దామనుకోవడం పెద్ద పొరపాటు.

ఉత్తమ వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ వృధాకావు.

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యగ్రంథం.

ఉన్నతికి మూలమంత్రం ఆత్మ సమర్పణం, ఉన్నతికి అర్థం ఆత్మజ్ఞానం.

ఊరక లభించిన క్షీరాన్నం కంటే కష్టార్జితమైన భిక్షాన్నం మేలు.

ఎక్కడ ఉత్తమమైన క్రమశిక్షణ, వినమ్రత వుంటాయో అక్కడ స్వాతంత్ర్యం విలసిల్లుతుంది. లిలి జరిగింది.

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం వుంటుంది.

ఎంతగా ప్రచారం చేసినా అధర్మం ధర్మం కాదు. ఎవరిమీదైనా కోపం వచ్చినా, దిగమింగి శాంతంగా ఉండు.

ఎవరిపని వారు చేయకపోవడం వల్లనే ఏ దేశమైనా వెనుకబడుతుంది. 51

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైంది. మనం సంపాదించుకున్నదే శాశ్వతమైంది.

ఏ జాతి అయినా మిలియనీరులు, పెట్టుబడిదారులు లేకుండా మనుగడ సాగించవచ్చు. కాని కార్మికులు లేకుండా మనుగడ సాగించలేదు.

ఏ దేశంలో త్యాగమనే గుణం అపారంగా వుంటుందో. ఆ దేశం ఉన్నత లక్ష్యాలను అందుకోవడం ఖాయం. త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. 

ఏకత్వంలో విశ్వాసం వుంది.

‘ఏమి ఆలోచించాలి’ అని గాక, ‘ఎలా ఆలోచించాలి’ అని నేర్పడమే విద్య లక్ష్యం. విద్య ఉద్యానవనం వంటిది. సాగు చేయనిదే పంట రాదు.

ఒక మంచి వ్యక్తి ఎదురైనపుడు ఆయనను ఆదర్శంగా తీసుకో, ఒక చెడ్డవ్యక్తి తారసిల్లినపుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో.

ఒక మనిషిని అతడు చేసిన పనినిబట్టే అంచనా వేయాలి. ఆ పని చేయడంలో అతనికి ప్రేరణ యిచ్చిన ఉద్దేశ్యాన్ని బట్టి కాదు. మనిషి మనసులో ఏమున్నదో ఎవరికి తెలుసు?

ఒక దేశం ఔన్నత్యం, అది జంతువులపట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తిని అవమానించడం అంటే దైవసృష్టి మొత్తాన్ని అవమానించడమే.

ఒక పాసి నావ సంతటిని ముంచివేస్తాడు.

ఒక గొప్పజాతిగా మారాలనుకున్న దేశ ప్రజలకు సామూహిక క్రమశిక్షణ అత్యావశ్యకమైన నిబంధన.

ఒకేరకం అభిప్రాయాన్ని, ప్రవర్తనను బలాత్కారంగా కోరే స్నేహం అంత ఉపయోగకరమైనది కాదు.

ఓర్పు ఉంటే విఫలమయ్యే పనికూడా ఫలిస్తుంది. అది లేకుంటే ఏ పని అయినా ఫలించదు.

ఓర్పు, పట్టుదల ఉంటే మహా పర్వతాలనయినా అధిగమించవచ్చు.

ఓటమిని అంగీకరించటంలో ఏ మాత్రం తప్పులేదు. అలా అంగీకరించటాన్నే గెలుపుతో సమానంగా భావించాలి.

ఓరిమికి అపారమైన శక్తి వుంది. దండించే అధికారం ఉన్నా దండించకపోవడం నిజమైన ఓర్మి.

కర్తవ్యమే హక్కులకు నిజమైన ఆధారం. హక్కుని వాడుకోవటం, నీ ధర్మాన్ని నీవు నిర్వహించడంలోనే అది ఉంటుంది.

కష్టాలను తప్పించుకునేవారికంటే వాటిని అధిగమించే వాళ్లే విజయం సాధించగలరు.

కార్యశీలమైన యుగంలో గుడ్డి ఆరాధన ఎంత మాత్రం విలువలేనిది. అది తరచు ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటుంది.

కల్లు, సారా, బ్రాందీ, బంగి ఆకు మొదలైన మాదక పదార్థాలు సేవించకూడదు. వీటి వలన పన్నుల రూపంలో వచ్చే ఆదాయం అనర్థదాయకం. ఏ ప్రభుత్వమూ, ఈ పైశాచికలాభం ఆశించరాదు. ప్రజలు వీటికి దూరం వుండేటట్లు ప్రభుత్వం చూడాలి.

కన్నులు పోయినా వాడంధుడు కాడు, తప్పును కప్పిపెట్టుకున్నవాడే అంధుడు.

కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కులేదు. కంటికి కన్ను అని హింసకు ప్రతిహింస చేసుకుంటూపోతే యావత్ ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది.

కర్తవ్యం లేనివారికి హక్కులు ఉండవు, హక్కులన్నీ కర్తవ్య నిర్వహణ నుండే ఆవిర్భవిస్తాయి.

కుపుత్రులు నూర్గురు కంటే సుపుత్రుడు ఒక్కడు చాలు. క్షీణదశ రాకుండా చేయాలంటే నీలో క్రమశిక్షణ

క్రోధాన్ని అణచడమే మానవత్వం.

కోట్లాది ప్రజల జీవితమే రాజకీయం.

ఖడ్గబలంతోగాక, ప్రేమ బలంతో శాంతిని నెలకొల్పాలి. ప్రేమను మించి హృదయాలను జోడించగల శక్తి ప్రపంచంలో మరేదీ లేదు.

గడచిన ప్రతిక్షణం తిరిగిరాదని తెలిసి, ఎంత సమయం మళ్లీ వెచ్చిస్తాం.

గమ్యమూ, గమనమూ రెండూ ఉత్తమమైనవై ఉండాలి. గుడ్డలు లేనివాడికి గుడ్డలిచ్చి అవమానించడం ఎందుకు? పని ఇవ్వండి. పనిద్వారా తన గుడ్డలకు కావలసిన డబ్బును తానే సంపాదించు కుంటాడు.

గ్రామాలు సజీవంగానే కాక, బలిష్టంగాను, సమృద్ధి గానూ ఉండాలంటే గ్రామీణ దృష్టి దేశానికి సబబైనది.

చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది, పాఠాలను నేర్చుకోవడమే విద్య ఉద్దేశ్యం.

చదివిన దానిని మననం చేయాలి, జీర్ణించుకోవాలి, అనంతరం ఆచరణలో పెట్టి మన జీవితానికి అంగంగా తయారుచేసుకోవాలి.

చావటానికి ధైర్యం కలిగివుండడం అన్నిటికంటే గొప్ప వీరత్వం.

చెడుపట్ల సహాయ నిరాకరణోద్యమం పవిత్రమైనది.

చెడు చేయడానికి ఒక్కక్షణం చాలు, మంచి చేయడానికి జీవిత కాలం చాలదు. దీన్ని గమనించి జీవిత సమరంలో ఆచితూచి అడుగు వేసినవారే గుణవంతులు.

జరిగిపోయిన నిన్న, జరగవలసిన రేపుకన్నా, ఈరోజు ఎంతో విలువైనదని గ్రహించు.

జీవితంలో ప్రతి నిమిషం భగవదత్తం. మానవసేవ కొరకు అది ఇవ్వబడింది. ఎపెద్దద్

జ్ఞానానికి చరమ లక్ష్యం ఉత్తమ శీల నిర్మాణం.

జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే, మెట్లవైపు చూస్తూ ఉండకుండా, ఆ మెట్లు ఎక్కుతూ పోండి.

జాతిని నిర్మించుకోవడానికి ప్రజలే నడుం బిగించాలి.

జూదం, త్రాగుడు, కామం – పై ఖర్చు చేసిన డబ్బు రెండింతలు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు మీ డబ్బునూ, ఆరోగ్యాన్నీ రెండింటినీ పోగొట్టుకొంటారు.

జలధి నుండి వేఱుపడిన జలకణం ఇంకిపోతున్నది. ఇది జలధిలో భాగమైనపుడు తన రొమ్ముమీద భారమైన ఓడలను తీసుకునిపోతూ కీర్తినార్జిస్తుంది. డంబం అసత్యానికి పై తొడుగు.

తమవంతు పని చేయకుండానే పూట పూట భోజనం పొందేవారు దొంగలు.

తత్త్వజ్ఞాన శోభితుడే సద్గురువు. అతడే బోధ గురువు.

తప్పు చేయటం పాపమే కాని, దానిని మరుగుపరచడం మహా పాపం. 100

తనకు తాను తృప్తిపడే మానవుడు ఎదగడు. అట్లని దురాశ పనికిరాదు.

తమలోని ఈశ్వర చైతన్యాన్ని మేల్కొల్పటానికి తపన పొందే ప్రతివారూ ప్రార్థనపై ఆధారపడక తప్పదు.

తన బలహీనతలను, అనర్హతలను అంగీకరించడమే ప్రార్ధన.

తన ఆహారం సంపాదించుకోవడానికి, అవసరమైన పని చేయడానికి మనిషిని దేవుడు సృష్టించాడు.

తనకేమీ తెలియదని కూడా గ్రహించలేనివాడు మూర్ఖ శిరోమణి.

తన వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి * ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు.

తనకు తాను తృప్తిపడే మానవుడు ఇంక ఎదగడు.

తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించే వ్యక్తికి వాటంతట అవే హక్కులు సంక్రమిస్తాయి.

తప్పును ఒప్పుకోవడం – చెత్తని, చెదారాన్ని తుడిచి శుభ్రంచేసే చీపురులాంటిది.

తోటి జీవాలపై మనం కనీసం చూపవలసిన దయాభిమానాలను చూపలేకపోతే మిమ్మల్ని కరుణించమని, ఆశీర్వదించమని రోజూ మీరు చేసే దైవప్రార్థన దండగ.

తోటివారి సంక్షేమం కోసం మనిషి ఎంతగా పాటుపడతాడో సరిగ్గా ఆ మేరకే అతడు గొప్పవాడు అవుతాడు.

త్యాగం కొరకు త్యాగం చేయటం కష్టమే కాని, సేవకొరకు త్యాగం చేయటం సులభమే.

తృప్తిలోని మంచి గుణాన్ని విశ్వమంతటా వ్యాపింపజేయటానికి వీలుగా ధనికులు కూడబెట్టే విధానానికి స్వస్తి పలకాలి.

దేశానికి స్వాతంత్య్రం వస్తే వ్యక్తులందరికీ స్వాతంత్ర్యం వచ్చినట్లే.

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు నిర్మించడం కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.

దేశాన్ని అభిమానించేవాళ్లు మాత్రమే దేశాన్ని అభివృద్ధి

చేయగలరు.

దౌష్ట్యాన్ని ద్వేషించాలిగానీ, దుష్టుణ్ణి కాదు.

దుష్టుణ్ణి కూడా క్షమించి ప్రేమించడమే సత్యాగ్రహం.

దుష్టుల చేతికి నీతిశాస్త్రం అనే ఆయుధం చిక్కిందంటే, ఇక వారు పిశాచాలయినట్లే.

దుష్టుల చరిత్రలను వినగోరువాడే నిజమైన కుష్టురోగి.

దుష్టుణ్ణి మనం క్షమించవచ్చు. కాని దుష్ట గుణాన్ని ధిక్కరించడంలో ఏ మాత్రం మినహాయింపు పనికిరాదు.

ద్వేషించిన వారిని ప్రేమించడమే అహింస.

ధనాగారానికి తాళపు చెవి లాంటిది ప్రార్ధన. ఫ్ట్

ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం – ఈ మూడింటితోనే చాలామంది సామాన్యులు నాయకులైనారు.

ధైర్యం లేనివాడు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేడు. ఒకవేళ అది లభించినా దాన్ని నిలుపుకోలేడు.

ధ్యేయం పవిత్రమనది కావడంతో పాటు, ఆ ధ్యేయాన్ని సాధించడానికి అవలంబించే మార్గాలు కూడా పవిత్రమైనవి కావాలి.

ధనవంతుడు తనకు సంక్రమించిన ఆస్తికి ధర్మకర్త మాత్రమే గానీ వారసుడు కాదు. స్వార్జితమునకు కూడా ధర్మకర్తగానే వ్యవహరించాలి. తనకు అవసరమైన దానిని మాత్రమే అనుభవించాలి. మిగులు ఆస్తి ధర్మనిధికి చెందాలి. అట్టి నిధి సమాజ శ్రేయస్సుకు వినియోగించుకోవాలి.

ధర్మంలేని రాజనీతి ఉరిత్రాడని గ్రహించాలి. అది ఆత్మనాశనం చేస్తుంది.

ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఉంచుకో. నిరాశ కెన్నడూ మనసులో తావీయకు.

ధనం, అధికారం, ఆడంబరాలపట్ల గురుత్వం చూపనారంభించిన నాటినుండి నీలో పతనం ప్రారంభమవుతుంది.

నా జీవితమంతటా నేను లాభం పొందింది నన్ను విమర్శించే వాళ్లనుంచే కాని, నన్ను అభిమానించే వాళ్లనుంచి కాదు. మరీ ముఖ్యంగా, మృదువుగా, సాత్వికమైన భాషలో ఉన్న విమర్శల ద్వారా లాభిస్తుంది.

నా బలహీనతలను పూర్తిగా ఎరిగి ఉండటమే నా

నాలో హాస్యచతురతే లేకుంటే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని.

నాకు మాత్రం కోపం రాదా? వస్తుంది. కాని, వచ్చిన కోపాన్ని అణచుకుంటాను. ఆ ప్రయత్నంలో ఎప్పుడూ

నేనే విజయం పొందుతాను. అదే నా జీవిత సాఫల్య రహస్యం.

నిరంతర శ్రమయే సత్యానికి మూలాధారం. అయితే మన అందరి కర్తవ్యాలు అమూల్యమైనవి. ప్రయత్నిస్తే హక్కులు ఎంతో దూరంలో లేవు.

నిమ్నజాతి ప్రజలకు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం లోపించిన నాడు స్వరాజ్యం, స్వరాజ్యమే కాదు.

నిజంగా రుచిని తెలియజేసేది మనస్సే, నాలుక మాత్రం కాదు.

నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించడం మొదటి మెట్టు అవుతుంది.

నిజంగా విలువైన పని ఏది చేయాలన్నా మనం హేతువును మాత్రమే సంతృప్తి పరిస్తే చాలదు. హృదయాన్ని కూడా కదిలించాలి.

నిష్కామ సేవే జీవిత రహస్యం.

నిర్మించటానికి శక్యం కాని జీవితాన్ని నిర్మూలించటానికి మనకు అధికారం లేదు.

నిటారుగా నిలబడి జీవించడమే స్వాతంత్య్రం.

నిన్నటి తప్పుల గురించిగాని, రేపటి కష్టాల గురించిగాని దిగులుపడటమే అతి పెద్ద తప్పు.

నిజాయితి, సమర్థత, స్వార్థత్యాగం కొరవడితే వ్యవస్థలు మారిపోతాయి.

నిజాయితీతో కూడిన ప్రార్ధన, పర్వతాలను సైతం కదిలిస్తుంది.

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ వుపయోగంలేని ధర్మబోధలకు అర్థం లేదు.

నిజాయితీగల సేవలోనుంచే అధికారం కలుగుతుంది.

నిజమైన నాగరికత కోరికలను అదుపులో పెట్టుకోవడం లోనే ఉంది. కాని, వాటిని పెంచుకోవడంలో లేదు.

నిరంతర కృషి వల్లనే దేశాభ్యుదయం సాధ్యపడుతుంది కాని, నిష్క్రియాపరత్వం వల్ల కాదు.

నీ సంకల్పం సిద్ధించుటకు ఆత్మనిగ్రహం, మౌనం అలవర్చుకో.

నీవు చేయదలచుకున్న పనిని అది చిన్నదైనా, పెద్దదైనా, ప్రముఖమైనదైనా, కాకున్నా – శ్రద్ధతో, జాగ్రత్తతో చేయటం ముఖ్యం. 151

నీతిమంతులయిన తల్లితండ్రులకు మించిన అధ్యాపకులు లేరు.

నీరు పల్లానికి ప్రవహించినట్లే, దుర్గుణం మానవుణ్ణి అధోగతిపాలు చేస్తుంది.

నేత్రాలు దేహానికి దీపాలు.

నేటి నీ తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాది.

నేను నివారించలేని ఆపద ఎదురైనప్పుడల్లా ఉపవాసం, ప్రార్థన చేయడమే నా మతం.

నేరం ఒక వ్యాధి వంటిది. కనుక దానికి అలాగే చికిత్స చేయాలి.

పట్టుదల గలవారు శ్రమను లెక్క చేయరు.

శ్రమించేవారు ఆటంకాలున్నా పురోగమించగలరు. పట్టుబట్టి సాధించుకోవలసింది కీర్తి. పదిలంగా సంరక్షించుకోవలసింది గౌరవం.

పగ సాధింపు చర్యలు ఆపితే, నిన్నటి శత్రువులు రేపటి స్నేహితులు కాగలరు.
పరాజయం పొందడం అంటే నీవు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం.
పరిశుద్ధహృదయం నుండి వెలువడిన మాట ఎప్పటికీ నిష్ఫలం కాదు.
పనిచేయకుండా తిండి తినేవారు దొంగలతో సమానం.
పరహింసా ప్రయత్నంలో మరణానికి పాల్పడిన లక్షలాది వ్యక్తుల బలిదానం కంటే ఒక్క నిష్కపట వ్యక్తి చేసే ఆత్మార్పణం లక్షరెట్లు శక్తివంతమైనది.
పరుల దయ కోరటం అంటే తను స్వాతంత్ర్యాన్ని అమ్ముకోవడమే.
పత్రికా స్వాతంత్ర్యాన్ని నిజంగా గౌరవించడమంటే పత్రికలు కఠిన భాషలో వ్యాఖ్యానించినప్పటికీ,
ఎప్పుడైనా విషయాన్ని తప్పుగా పేర్కొన్నప్పటికీ, సహించడమే.
పాపం దాగి వుండదు. అది మనిషి ముఖం మీద తాండవిస్తుంది.
పాకీవాని పని పాలకుని కృషికి ఏమాత్రం తీసిపోదు. శ్రామికుడు, వ్యవసాయ కూలీ, కార్మికుడు, కృషీవలుడూ అందరూ పూజనీయులే.
పాషాణపుచుక్క పాలను విషం చేసినట్లు అస్పృశ్యత హిందూ మతాన్ని కలుషితం చేస్తున్నది.
పాప కర్మలకు అంధకారం అవసరం.
పిరికివాడి తెలివి దూరదృష్టితో పనిచేయలేదు.
పిరికితనం, హింస, వీటిలో ఒకదానిని ఎన్నుకోవలసి వస్తే హింస వైపు మొగ్గటమే మంచిది.
పుట్టుకతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. పౌరహక్కులు గనుక అణచివేయబడినట్టైతే, జాతి తన జీవశక్తిని అంతటినీ కోల్పోయి బలహీనంగా శౌర్యహీనంగా తయారవుతుంది.
పేరాశ, కపటం హింసకు సంతానం, తల్లితండ్రులు కూడా.
పేదవానికి భగవంతుడు ఆహార రూపంలో గోచరిస్తాడు.
పేదవారిలోకెల్లా పేదవారితో ఐక్యభావం అలవరచుకుని, వారికి సేవ చేయడం ద్వారా తప్ప ఆత్మజ్ఞానం సిద్ధించదని నా నమ్మకం.
పేదవానికి భగవంతుడు ఆహార రూపంలో గోచరిస్తాడు.
పైసాలో పరమేశ్వరుడిని చూడటం, పరమేశ్వరుని విస్మరించడం వంటిదే.
పొదుపు చేయవలసిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు.
పోయిన క్షణం ఎన్ని రత్నాలు ఇచ్చినా తిరిగిరాదు.
ప్రతిచోటా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
ప్రజావాణి దివ్యవాణి.
ప్రజాభిప్రాయంతో ముడిపడకుండా కర్తవ్య నిర్వహణ స్వతంత్రంగా సాగాలి.
ప్రజానాయకులకు వారికి వచ్చే బహుమతులు వారివి కావు. అవి సమాజ సేవకే వినియోగించాలి.
ప్రభుత్వ అధికారాల పెంపును చూచి నేను భయపడుతుంటాను. అందరి అభ్యుదయానికి కారణభూతమైన వారి వ్యక్తిత్వాన్ని అది నాశనం చేసి, మానవాళికి తీరని అపకారం చేస్తుంది.
ప్రపంచంలో పురుషుడు చేసే అపరాధాలలో ముఖ్యమైనది తన అర్ధాంగిని చులకన చేసి మాట్లాడడం, లోకువగా చూడడం.
ప్రపంచంలోని పురాణాలన్నీ సమర్థించినా తప్పుతప్పే. ప్రజలే వేళ్లు, ప్రభుత్వమే ఫలము. వేళ్లు తియ్యగా ఉంటేనే ఫలము తియ్యగా ఉంటుంది.
ప్రతి మనిషి చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకోవాలని భగవంతుడి ఆదేశం.
ప్రతికూలమైన వాతావరణం నుంచే క్రమశిక్షణ నేర్చుకోవాలి.
ప్రాణం పోయినా సరే, సరైన పని చేయడమే సరైన మార్గం.
ప్రాణం యిచ్చేందుకు శక్తిలేని మానవునకు ఏ జీవి ప్రాణాన్నీ తీసేందుకు హక్కులేదు.
ప్రార్ధన ఏ మాత్రం వ్యర్థం కాదు కాని, అది ఎప్పుడెలాంటి ఫలితాలనిస్తుందో మనకు అర్థం కాదు.
ప్రార్ధనకు ముఖ్యమైనది హృదయం కాని, కంఠం కాదు. ప్రార్ధన అంటే యాచించడం కాదు. అది ఆత్మ అందించే పిలుపు.
ప్రార్ధన ఉదయం తలుపులు తీసే తాళం చెవి, సాయంత్రం తలుపులు మూసే గొళ్ళెం.
ప్రేమతో కూడిన పని ఎంతటిదైనా తూలికలాగా తేలికౌతుంది.
ప్రేమ ఇస్తుందే కాని ఇమ్మని కోరదు. బాధలను సహిస్తుందేకానీ ప్రతీకారం తలపెట్టదు.
ఫలితం కాదు కృషి సంతృప్తినిస్తుంది. పరిపూర్ణమైన కృషియే పరిపూర్ణమైన విజయం. 200
బలహీనమైన, వివేక రహితమైన ప్రభుత్వానికి పరిపాలించే హక్కు వుండదు. అట్టి ప్రభుత్వం వెంటనే ఆ స్థానాన్ని ఇతరులకు వదిలెయ్యాలి.
బతకాలనే లోభం విడనాడి బతికినవాడి బతుకే బతుకు.
బాధ్యతలు నెరవేరిస్తే హక్కులు వాటంతటవే సంక్రమిస్తాయి.
బాధ్యతలను గుర్తించి, వాటిని సంపూర్ణంగా నిర్వర్తించిన వారికే హక్కుల గురించి పోరాడే అధికారం ఉంటుంది.
బహ్మచర్యం అంటే సంభోగ విరమణ మాత్రమే కాదు. సర్వేంద్రియ నిగ్రహం కూడా.
బుద్ధి హృదయానికి దాసిగా మెలగాలి.
బెదిరించడం కూడా హింసయే. హింసవల్ల ఏ వ్యక్తినీ నిజాయితీపరుడుగా మార్చలేము.
భయం వలన పొందే ‘ఆధిపత్యం’ కన్నా అభిమానంతో పొందే ‘బానిసత్వం’ మిన్న.
భారతీయులు తమలోతాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు. మనకు నిజంగా స్వేచ్ఛకు అర్హత ఉన్నట్లు.
భార్య భర్తకు కట్టుబానిస కాదు. ఆమె చెలికత్తె, సహచారి, సహాయకారి, సుఖ దుఃఖాలలో సమాన భాగస్వామిని, పదనిర్ధేశంలో భర్త వలెనే స్వేచ్ఛగలది.
భోగ భాగ్యాలకోసం, వెర్రి పరుగులు పరుగెత్తకూడదు. మతాంతీకరణ ద్వారా సాంఘిక సమానత్వం సాధించ గలమని నేను భావించడం లేదు.
మలిన పాత్రలో పోసిన శుద్ధ జలం మలినమైనట్లు, మలిన మనసులోని సద్భావాలు కూడా మలినమౌతాయి.
మరణానికి సిద్ధమైన వ్యక్తి స్వేచ్ఛగా జీవిస్తాడు.
మన తప్పును ఒప్పుకోవడమే ఆత్మశుద్ధికి ప్రథమ సోపానం. మనలోని సర్వోత్తమ తత్త్వాన్ని వెలికి తేగలిగేదే నిజమైన విద్య.
మతవాదం కన్నా జాతీయవాదం గొప్పది.
మానవుణ్ణి దానవుడిగా మార్చేది కార్పణ్యం. మానవుణ్ణి మాధవుడిగా మార్చేది కరుణ.
మనం ఇచ్చినంత సేపు ధనవంతులమౌతాం. ఇవ్వకుండా దాచిపెట్టుకున్నంతసేపు పేదలమౌతాం.
మనిషికి ఆభరణం రూపం. రూపానికి ఆభరణం గుణం. గుణానికి ఆభరణం జ్ఞానం, జ్ఞానానికి ఆభరణం క్షమ.
మంచి ఎప్పుడైనా నత్తనడక నడుస్తూ ఉంటుంది. ఇక చెడు ఉందే రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది. మంచితనం, గొప్పతనం అనేవి సంపదలో కాదు, నిరాడంబరతలోనే వున్నాయి.
మంచి ఆలోచన ఎప్పుడూ వృథా కాదు.
మంచి పుస్తకాలు మన చెంత వుంటే మంచి మిత్రుడు దగ్గరలేని లోపం తీరుతుంది.
మంచిచెడుల మధ్య నిరంతరం సాగే సంగ్రామానికి ప్రతీకలు రామ రావణులు.
మన స్థాయికి మించిన అలవాట్లను ఎప్పుడూ అలవరచుకోరాదు. ఒకరోజు పెద్ద బంగళాలో ఉంటే మరో రోజు గుడిసెలో ఉండటానికి కూడా సిద్ధంగా ఉండాలి.
మన దేశంలో స్త్రీలు ఆరుబయట అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరగగల్గినప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించినట్లు అనుకోవాలి.
మనమంతా ప్రేమ భావంతో, సోదర భావంతో నివసించగలిగితే ఈ ప్రపంచం యొక్క ఆకారాన్ని మార్చి దానిని నూతన ప్రపంచంగా తీర్చిదిద్దవచ్చు. మానవుడు దురాశ, పేరాశలకు అతీతుడవ్వాలి.
మానవుణ్ణి వెలివేస్తే భగవంతుణ్ణి వెలివేసినట్లే.
మానవజాతి మనుగడకు ఓర్పు, సహనం, శాంతి ప్రధానం.
మాటలతో కూడిన హృదయం లేని ప్రార్థన కంటే, మాటలు లేకుండా హృదయంతో చేసే ప్రార్ధన గొప్పది.
మానవ సమాజం కొరకు మరణించాలని ఆరాటపడడానికి ముందు భారతదేశంలో జీవించడం నేర్చుకోవాలి.
మాతృదేశ స్వరాజ్య సాధనకు సత్యాన్ని విడనాడమని ఎవరైనా చెబితే, దానికి బదులు మాతృదేశాన్ని విడనాడతానంటాను.
మానవ సేవలో దైవాన్ని దర్శించాలన్నది నా లక్ష్యం. భగవంతుడు స్వర్గంలో గాని, పాతాళంలో గాని లేడు. ఆయన మనందరిలో ఉన్నాడు.
మితంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, మనిషికి గౌరవం తెచ్చేవి యివే.
మీ ప్రవర్తనతో, ఇతరులు మిమ్ములను అంగీకరించేలా చేయండి.
మీ అసమర్థతను కాపాడుకోవటానికి అహింస అనే ముసుగు వేసుకోవడం కన్నా, హృదయంలో హింసాభావం ఉంటే దౌర్జన్యపూరితంగా ఉండటమే మంచిది.
మీ బిడ్డలకు మొట్టమొదట విధేయత నేర్పండి. తరువాతే మిగిలినవన్నీ.
ముఖంమీద చిరునవ్వులేని మనిషి పూర్తిగా బట్టలు వేసుకోని వారితో సమానం.
ముత్యపుచిప్పల్లో వెండి, ఎండమావుల్లో నీరు వుండటం వట్టి అబద్ధం.
మృత్యువులో జీవితం, జీవితంలో మృత్యువు చూడగలిగినవాడే నిజమైన కవి లేక ద్రష్ట.
మౌనవ్రతం పాటించడం మంచిది. మౌనం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. మనస్సును శాంతిమయం చేస్తుంది.
యదార్ధమైన విభేదాలు తరచుగా సక్రమమైన అభివృద్ధికి చిహ్నాలు.
యంత్రం ప్రపంచాన్ని దగ్గరకు తెచ్చింది కాని, దేశాలను దూరం చేసింది.
యాచించడం నేర్పకూడదు. జీవించడం నేర్పాలి. పరులపై ఆధారపడ్డం నేర్పవద్దు. స్వంత కాళ్ళపై నిలబడ్డం నేర్పాలి.
రాజీ అనేది నా జీవితంలో భాగం.
రైతు పంటకు ఎరువు వేసి, నీరు పెట్టి ఊరుకోడు. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేస్తాడు. కలుపు తీయని యెడల మంచి పంట రాదని అతనికి తెలుసు. అలాగే మానవ సమాజంలో మంచిని ప్రోత్సహించినంత మాత్రాన చాలదు. చెడు నిరోధించాలి.
రోగులు మనకు కృతజ్ఞతగా ఉండనవసరం లేదు. సేవ చేయడానికి అవకాశమిచ్చినందుకు మనమే వారికి కృతజ్ఞతగా ఉండాలి.
లేని గొప్పదనం ఉందని చెబితే, ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది. 250
వర్తమానం గురించి మనం ఆలోచిస్తే చాలు, భవిష్యత్తును గూర్చి భగవంతుడే చూసుకుంటాడు.
వదంతులు వినవద్దు, ఒకవేళ వినవలసివస్తే వాటిని నమ్మవద్దు.
వస్త్రధారణ మనసును తెలిపేదిగా వుండాలి. అంటే వస్త్రాలను బట్టి మనను శుభ్రతను అర్ధంచేసుకోగలగాలి.
వ్యక్తి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు, హృదయం. వ్యక్తిలో గల ఔన్నత్యం మేధస్సులోగాక హృదయంలో ఉంటుంది.
వ్యసనం ఎప్పుడూ చీకటిలో విజృంభిస్తుంది. వెలుగు చూడగానే పారిపోతుంది.
వాక్ స్వాతంత్య్రం అంటే మన హక్కు పాలకులను నొప్పించినప్పటికీ, అది ప్రభుత్వ దాడికి గురి కాకూడదు.
విజ్ఞానాన్ని, గుణపాఠాన్ని నేర్చుకోవడమే విద్యయొక్క ప్రయోజనం.
విద్యను దాచుకోకు. దానిని పదిమందికి పంచితే అది మరింత రాణిస్తుంది.
విద్య వలన వినయం, వినయం వలన వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి.
విద్యార్థి చదివే నిజమైన పాఠ్యపుస్తకం అతని ఉపాధ్యాయుడే.
విదేశీ సంస్కృతిని వదిలి దేశ సంస్కృతిని అలవరచుకో. వినయానికి, చిత్తశుద్ధికి, ఆత్మపరిశోధనకు సహాయపడగల సాధనమే ప్రార్థన.
విధి నిర్వహణకు మించిన దేశసేవ లేదు. విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృధా.
వినయం లేనిచోట మనుషులు తమ విద్యను సదుపయోగం చేసుకోలేరు.
విప్లవకారులంతా సంస్కర్తలౌతారు. సంస్కర్తలంతా విప్లవకారులౌతారు.
విముక్తి ప్రభుత్వాలకు కాదు, ప్రజలకు రావాలి.
వివేకం పాలించేచోట, శాంతి పుష్కలంగా లభిస్తుంది.
విశ్రాంతి – చినిగిన గుడ్డకు తగిన సమయంలో మాసిక వేసినట్లు.
వెలుగు ఎక్కడ వుంటుందో, నీడ కూడా అక్కడే వుంటుంది.
వెలుతురుంటే చీకటి, జననముంటే మరణం తప్పవు.
ఈ ద్వంద్వాలనుండి విడివడుటయే అనాసక్తి.
వైరాగ్యమంటే అసత్యాన్ని వదిలి సత్యాన్ని చేపట్టడం.
వేదాంత మతబోధకు వైరాగ్యమే ముఖ్యం.
శత్రువుపట్ల గల మిత్రభావమే ప్రేమ.
శత్రువుమీద గెలుపు సాధించడం కన్నా శత్రుత్వాన్ని నిర్మూలించడం మిన్న.
శరీరం ఆత్మ నివసించే స్థానం కనుక, అది పుణ్యక్షేత్రంలా పవిత్రమైనదే.
శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిస అవుతుంది.
శక్తి సామర్ధ్యాలు సంకల్పశుద్ధితో సంక్రమిస్తాయి.
శక్తి భౌతిక సామర్థ్యం నుంచి రాదు. దృఢదీక్ష నుంచి అజేయశక్తి జనిస్తుంది.
శరీరానికి ఆహారం ఎలా అవసరమో అలాగే ఆత్మకు ప్రార్ధన అవసరం.
శ్రద్ధ ఎవరి సలహాకోసం ఎదురు చూడదు.
శ్రమ, బాధ్యతల ఫలం హక్కు,
శీల రహితమైన విజ్ఞానం అపకారం కలిగించే శక్తి మాత్రమే.
శీలసంపదను పెంపొందించలేని విద్య పరిమళం లేని పువ్వు వంటిది. ఆ విద్య నిరర్థకం, అనర్థకం.
శుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, సాత్త్విక భోజనం, పరిశుద్ధ భావన ఈ నాలుగూ మానవుడికి అవసరమైన ముఖ్య నియమాలు.
సంకల్పబలంతో నిరంతర ప్రయత్నం చేసేవారికి ఏదీ అసాధ్యం కాదు. విజయ సాధనకు ఏకైక సూత్రం అదే.
సంశయములు నన్నావరించినపుడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిరుత్సాహములు జనించినపుడు నేను భగవద్గీతను తెరచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకం నన్నూరడిస్తుంది… మీరు కనివిని యెరుగని అమూల్య జ్ఞాన భండారం భగవద్గీత.
సగం సగం చేసే పని కాలీకాలని రొట్టె లాంటిది. సచ్చీలానికి దోహదం చేయని విద్య నిరర్ధకం.
సత్ప్రవర్తన లేని విద్యాజ్ఞానాలు వ్యర్థం.
సత్యం ఒక మహావృక్షం. దానిని మనం ఎంతగా పోషిస్తే అంతగా ఫలాలను ఇస్తుంది.
సత్యంలో నమ్మకం వుంటే సరి. దేవునిలో నమ్మకం లేని వ్యక్తి కూడా హిందువుగా ఉండవచ్చు.
సత్యం గోప్యాన్ని అసహ్యించుకుంటుంది.
సత్యాన్ని అనుసరించడానికి కావలసింది సాహసం ఒక్కటే. సత్యానికి నిజమైన స్వేచ్ఛనిస్తే ఆ సత్యం నీకు స్వేచ్ఛను కల్గిస్తుంది.
సత్యం, అహింస ఒకదానితోఒకటి ముడివేయబడి ఉన్నాయి గనుక, వాటిని విడదీయటం సాధ్యం కాదు. అవి ఒకే నాణానికి బొమ్మ, బొరుసు వంటివి.
సత్యంతో ఏ వస్తువును పోల్చి చూచినా సత్యమే సదా బరువుగా ఉంటుంది.
సంపూర్ణ సత్యమయుడైన వ్యక్తికి నిరాశ ఉండదు. సత్యాన్ని, ధర్మాన్ని కోల్పోని మనిషి నాస్తికుడైనా పర్వాలేదు.
సత్యాగ్రహి అసత్యాన్ని సత్యమని భావించి, మొండితనం చేస్తే దురాగ్రహి అవుతాడు. 
సత్యాగ్రహం అధికారాన్ని పొందడానికి కాడు, అధికారాన్ని శుద్ధి చేయటానికి, సద్వినియోగం
చేయటానికి మాత్రమే.
సరైన అవగాహనకు క్రోధం, అసహనం జంట శత్రువులు.
స్వంత గొప్పతనం లేనివారు పెద్దల ఘనత చెప్పుకుని గర్విస్తారు.
సాహసం శారీరకమైనది కాదని, అది ఆత్మకు సంబంధించినదని గ్రహిస్తే విజయం సాధిస్తాం.
సిద్ధాంతాలు లేని రాజకీయాలు, కష్టపడకుండా సంపద రావాలనుకోవడం, సహృదయంలేని సుఖం, వివేకంలేని విద్య, నీతిలేని వ్యాపారం, భక్తి, త్యాగం లేని ఆరాధన, మానవత లోపించిన శాస్త్రవిజ్ఞానం ఈ ఏడు సంఘాన్ని పీడిస్తున్న మహాపాపాలు. వీటిని మనం వదులుకోవాలి.
సుఖశాంతులనేవి ఒకరికి నీవు ఇచ్చే వాటిపై ఆధారపడి ఉంటాయి. అంతేకాని వారి నుండి నీవు పుచ్చుకునే వాటిపై కాదు.
సృష్టిలో ప్రేమను మించిన పవిత్రమైనది ఏదీ లేదు. సోమరిపోతులు దొంగలతో సమానం.
సోమరితనం, బానిసత్వం దేశానికి మిక్కిలి హానికరమైనవి.
సోమరితనం, అజ్ఞానం అనే రెండు పురుగులు మనలను తినివేస్తున్నాయి.
స్త్రీలు ఎంత అభివృద్ధి చెందితే, ఆ దేశం అంత అభివృద్ధి చెందినట్లుగా భావించాలి.
హక్కుల నిజమైన మూలాధారం బాధ్యతలోనే ఉంది. హేతువు శుభప్రదమయినపుడు ఆత్మ కలుషితం కాదు.
హిందూ మతానికి మానవ ప్రాణుల ఏకత్వంలోనే కాదు, అన్ని జీవుల ఏకత్వంలో విశ్వాసముంది.
హింసామార్గం ఆటవిక మార్గం. అహింసా పథమే అత్యు
హింసకు వ్యతిరేకంగా అనివార్య పరిస్థితుల్లో జరిగిన హింస అహింసే అవుతుంది.

Discover more from CHILCH

Subscribe to get the latest posts sent to your email.

Explore more

chilch.com

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026Revati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Rasi

Revati Nakshatra Pada 4 Female RasiRevati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the planet Mercury and...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Health

Revati Nakshatra Pada 4 Female HealthRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Compatibility

Revati Nakshatra Pada 4 Female CompatibilityRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Profession

Revati Nakshatra Pada 4 Female ProfessionRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Appearance

Revati Nakshatra Pada 4 Female AppearanceRevati Nakshatra is the last nakshatra of the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Names

Revati Nakshatra Pada 4 Female NamesAccording to Vedic astrology, the fourth pada of Revati Nakshatra is ruled by the planet Mercury. This pada is...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Celebrities

Revati Nakshatra Pada 4 Female CelebritiesRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...