Annamayya Malayamarutham మలయమారుతం. ఝంప

Annamayya Malayamarutham మలయమారుతం. ఝంప

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మరి యిదిగాక వైభవం- బికనొకటి గలదా

అతివ జన్మము సఫల మై పరమ యోగివలె నితర మోహాపేక్ష – లిన్నియును విడచె సతికోరికలు మహా శాంతమై యిదే చూడ సతత విజ్ఞాన వా- సనవోలె నుండె

తరుణి హృదయము కృ తార్థత బొంది విభుమీది పరవశానంద సం సరసిజాసన మనో పదకు నిరవాయె జయమంది యింతలో సరిలేక మనసు నిశ్చల భావమాయె

శ్రీ వేంకటేశ్వరుని – జింతించి పరతత్వ భావంబు నిజముగా బట్టె చెలియాత్మ దేవోత్తముని కృపా – ధీనురాలై యిపుడు లావణ్యవతికి ను- ల్లంబు తిరమాయె

అన్నమాచార్యులు అద్భుత సౌందర్యలహరులుగా వెలయించిన సంకీర్తనలు ఎన్నో ప రమానందసిద్ధి పొందిన పరమయోగిలో శృంగార నాయికనూ, ఆ నాయికలో యోగినీ పరస్పరం ఆపాదించి, వారుభయులకూ అభేదమేర్పరచి, శ్రీయోగ విద్యాతంత్రపరంగా, శృంగార వేదాంతాలని పరాకాష్టకు చేర్చిన ఈ ప్రక్రియ ఆంధ్ర సాహిత్యంలోనే కాదు మరే భాషా సాహిత్యంలోనూ లేదనడం స్వభావోక్తియే.

నాయిక అలమేల్మంగ శ్రీ వెంకటపతితో రతికేళిని చొక్కి వివశయై ఉన్నది. ఆమె జన్మ సఫలమై పరమయోగివలె, ఇతర మోహాపేక్షలన్నీ త్యజించినది. శ్రీవిద్యాపరంగా యిక్కడ త్రైలోక్య మోహన చక్రం. ప్రధమావరణం శృంగారరసం, మూలాధారచక్ర ప్రకృతీ సూచితం. ఆమెకోరికలు అన్నీ తీరి శాంతించినవి. (సర్వాశా పరిపూరక చక్రం సూచి తం). ఆ శాంతస్థితి సతతమైన విజ్ఞాన వాసనవలె ఉన్నదట. ‘ఈశ్వరానుగ్రహాత్ పుంసామ ద్వైత వాసనా ‘ జ్ఞానాదేవతు కైవల్యం అన్నవి సమ్రాణ వాక్యాలు. చిచ్ఛక్తి అజ్ఞాన తిమిరాన్ని

తొలగించే దీపం గనుక ఇక్కడ స్వాధిష్ఠాన చక్రం సూచితం.

తరుణి హృదయము కృతార్థత పొందినది. విభునిమీది పరవశానంద సంపదకు ఆమె యెద భాండారమైనది. లక్ష్మీ హృదయంలో విష్ణునియెడ పరవశానంద సంపద ఉండడం ధర్మం. ఆమె ప్రకృతి. ఆయన పురుషోత్తముడు. లక్ష్మీ హృదయవాసి శ్రీనివాసు డు. శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాత, ఇక్కడ ‘హృదయం’లో అనాహత చక్రం సూచితం. పరవశానంద సంపద అన్నపుడు విశుద్ధ చక్ర సూచన.

సరసిజాసన మనో జయమందినది. ఆమె జిత మనోవస్థ ఉపమించరాని దైనంత లో కేంద్రీకృత శ్రీవేంకటేశ్వరైక భావనమై మనసు నిశ్చలమైనది. సరసిజానన మనోజయ మందినది అనడంలో గూడార్థం ఉన్నది. మనస్తత్వం గలది ఆజ్ఞా చక్రాన్ని దాటితే సహస్ర ధళ కమలం యోగులకు కన్పట్టుతుంది. ఆ సహస్రదళ పద్యంలో లక్ష్మీనారాయణులు విహరిస్తూ ఉంటారు. తత్కమల దర్శనం సిద్ధించిన వారికి సహస్రదళ కమలో పరివాసి యైన చంద్రుడు (మామూలు చంద్రునికన్న అన్యుడు) నిత్య అనే కళ గలిగి సాధకులపై బిందువు బిందువుగా అమృతాన్ని చిలికిస్తాడట. తత్సహస్రార పద్మ దర్శనాన్ని సూచించడా నికి ‘సరసిజాసన’ అన్నారు అన్నమాచార్యులు. (త్యాగరాజస్వామి ఎందరో మహానుభావు లు కీర్తనలో ‘చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మా నందమనుభవించువా’ రన్నప్పుడు ఇదే అర్థం. శ్రీరాముడు చందురు వర్ణుడు కాడుగదా మరి) ఆ సుధాబిందు నిష్పంద ప్రాప్తియే బ్రహ్మానంద సిద్ధియని సమయాచార తత్పరజనులూ పాతంజలీత్యాది యోగివరేణ్యులూ ఉద్వచించారు.

ఆమె నిర్మోహ, నిష్కామ నిష్కలంక నిరంజన నిర్వికల్ప నిరంతరర స్థితిలో శ్రీవేం కటేశ్వరుని నిశ్చలైక భావంతో చింతిం చినందున

పరతత్వభావమును సొంతం చేసుకున్నది చెలి యాత్మ (ఇందుకు ప్రమాణం హం స మంత్రం. ‘హంనిశ్శివస్సోహం, సోహం, హంసశ్శివ:’ అని, తానే ఆ స్వామిలో ఒదిగి ఆ యన కృపాధీనురాలైనది. ఆయన కృపయే తానైనదని ధ్వని. అప్పుడు కడు చంచలయై న లక్ష్మీ లావణ్యవతికి చాంచల్యం పోయి స్థిరమైన శ్రీ వేంకటేశ్వర దయాకారయై ఆమె తన సర్వస్వాన్నీ స్వామికి అరణం చేసిన త్యాగగుణం వల్ల అమృత తత్వాన్ని పొందినది. ‘త్యాగే నైకేన అమృతత్వ మానశు:’ అని శ్రుతి వాక్యం (త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం కలుగగలదు). ఈ సంకీర్తనలోని శ్రీవిద్యా విషయానికి ఆధారం శ్రీమచ్ఛంకరుల సౌందర్య లహరిలోని 9వ శ్లోకం.

మహీం మూలాధారే కమపి మణి పూరే హుతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశము పరి మనోపి భ్రూ మధ్యే సకలనుపి భిత్వాకుల పధం సహస్రారే రమ్మే సహరహసి పత్యా విహరసే శ్లోకతాత్పర్యమిది- ఓ శ్రీదేవీ మూలాధార చక్రంలో భూమి తత్వాన్ని, మణిపూర చక్రం ఉదకాన్ని స్వాధిష్ఠాన చక్రంలో అగ్నితత్వాన్ని, అనాహత చక్రంలో వాయు తత్వాన్ని, ఆజ్ఞా చక్రంలో మనస్తత్వాన్ని, ఈ కులపధ సకలమునూ అధిగమించి, (ఛేదించి) నీవు సహస్రదళపద్మంలో పతితోగూడ నిత్యవిహారము చేస్తుంటావు. మరి ఇంతకన్న సౌభాగ్యం, ఇంతకంటే తపము, ఇంతకన్న వైభవం మరెక్కడైనా కలవా? లేవు. భాగ్యంలో తపంలో వైభవంలో యిదే మలిమాట.

శంకరాచార్యులే అన్నమాచార్యులన్న భావం, నమ్మిక ఈ సంకీర్తన అమృతమును మధించేవారికి కలుగుతుంది.

ఈ సంకీర్తనకు ఈ వ్యాఖ్య చాలదు. వలసినవారు దర్శించవలసిన గ్రంధాలు.

1. శ్రీమచ్ఛంకరుల సౌందర్యలహరి (లొల్ల లక్ష్మీధర దేశికుల

లక్ష్మీధర వ్యాఖ్యతో), 33 నుండి 7 శ్లోకాలు ప్రత్యేకంగా,

2 ముత్తుస్వామి దీక్షితుల నవావరణ కీర్తనలు.

3 వేదాంత దేశికుల దయా శతకము.

ఈ కీర్తన అలమేల్మంగా శృంగారలక్ష్మీహృదయ మస్త్రం ఋషి మంత్రస్రష్ట అన్నమా చార్యులు. ఖండగతి పదకవిత ఛందం శ్రీవేంకటేశ్వరుడు అధిష్టానదేవత. మధుర భక్తి బీజం. సరస వక్రోక్తి కీలకం. ఆధ్యాత్మిక శృంగార విజ్ఞాన పరిపాకం శక్తి అలమేల్మంగా స హిత శ్రీవేంకటేశ్వర ప్రసాద రూప రససామ్రాజ్య ప్రాప్య ర్థం జపము వినియోగం. గానా భినయ తాళద్రుత కరణాలు అంగన్యాస కరన్యాసాలు, అన్నమాచార్య పదగానప్రియ హరి పదకమలకాంతి ధ్యానం, ధాతుమాతు పునరావృత్తియే పునశ్చరణ.

So much happiness – so much suffering and so much glory – is there another?
Ativa Janma Sufala Mai Parama Yogiva Nitarah Hohapeksha – Leave Linnius Satikorikas become great calm and see
Satata vijnana va- sanavole nude
At that time, the heart was filled with the words of Paravasananda, and the mind was overcome, and the mind became still.
Shri Venkateswara’s – Jintinchi Paratatva Bhavbu really but Cheliatma Devottamuni Kripa – Dhinuralai Yippu Lavanyavatiki Nu – Llambu Tiramaye
It is self-evident that this process, which has brought to the culmination of Sri Yoga Vidyatantra and Romantic Vedanta, by attributing the romantic heroine in the Paramayogi and the Yogi in that heroine, and distinguishing them from the brothers, is not found in the literature of any other language, not only in Andhra literature.
Heroine Alamelmanga is in love with Sri Venkatapathy in Chokki Vivasaya. She was successful in her birth and, like the Supreme Yogi, renounced all other desires. Srividya here is Trailokya Mohana Chakra. The pradhamavaranam is the romantic, muladharachakra prakriti. All her wishes were satisfied. (Always a complementary cycle index). That tranquility is like the smell of eternal knowledge. ‘Ishvaranugrahat pumsama dvaita vasana’ is the wisdom god kaivalyam, the words of wisdom, wisdom and ignorance.
Swadhishthana chakra is indicated here as the removing lamp.
Taruni’s heart was grateful. Vibhu is the storehouse of Paravasananda’s wealth. In Lakshmi’s heart there is wealth of bliss with Vishnu. She is nature. He is Purushottam. Lakshmi Hridayavasi Srinivasu. Sri Vishnu is Hritkamalavasini Vishwamata, where the Anahata Chakra in ‘Heart’ is indicated. Visuddha Chakra is indicated when Paravasananda is wealth.
Sarasijasana Mano Jayamandina. Her jita manovastha is incomparably centered in Srivenkateswaraika consciousness and her mind is calm. There is a hidden meaning in Sarasijanan Manojaya Mandinadi. If the mind crosses the Ajna Chakra, the Sahasra Dhala Lotus becomes visible to the yogis. In that Sahasradala poem, Lakshminarayan wanders. For those who have attained Tatkamala darshan, the moon (another than the ordinary moon) who resides in the Sahasradala Kama, has the art of Nitya and sprinkles amrita drop by drop on the devotees. Annamacharyas said ‘Sarasijasana’ to indicate Tatsahasrara Padma Darshan. (Thyagarajaswamy’s many sages said in their kirtans, ‘Let the beauty of Chanduru Varna be seen in the heart and enjoy Brahma Nandamanubhuvindu’. This is the meaning of Lord Rama’s Chanduru Varna.) Brahmananda Siddhiya of Sudhabindu Nispanda Prapti was expressed by Samaya Tatparajanu and Patanjali’s Yogi Charivaren.
Because she is preoccupied with the stillness of Srivem Katesvara in the state of nirmoha, nishkama niskalanka niranjana nirvikalpa continuous state.
It is Cheli Yatma who has acquired the sense of superiority (for this, the oath is the Hamsa mantra. ‘Hannisshivassoham, Soham, Hamsashshiva:’), she herself is absorbed in that Lord and is His grace. The sound is that His grace is hers. The Amrita philosophy is obtained by the sacrifice made to the Lord. The sruti verse says ‘Tyage Naikena Amritatva Manasu:’ (Only by sacrifice can one attain amrita). The Srividya content of this Sankirtan is based on the 9th Shloka of Srimacchankar’s Soundarya Lahari.
Mahim Mooladhare Kamapi Mani Pure Hutavaham
Sthitam Swadhishthane Hridi Maruta Makasamu Pari Manopi Bhru Madhe Sakalanupi Bhitvakula Padham Sahasrare Ramme Saharahasi Patya Viharase Shlokatatparyamidi- O Sridevi in ​​the Mooladhara chakra, Manipura Chakra Udakani in the Swadhishthana Chakra, Fire in the Anahata Chakra, Vayu in the Ajna Chakra, this Kulapadha Sakalam overcome, (break through) You are always roaming in Sahasradalapadma with Pati. And where else can you find more happiness, more suffering, more glory? There are none. This is the same word as the glory of suffering in fortune.
The feeling and belief that Shankaracharya is Annamacharya is felt by those who drink this nectar of sankirtana.
This comment is not enough for this hymn. Scriptures to be visited by the needy.
1. Srimacchankar’s Soundaryalahari (Lolla Lakshmidhara Desikula
with Lakshmidhara’s commentary), verses 33 to 7 in particular,
2 Navavarana Kirtans of Muthuswami Dikshi.
3 Vedanta Desikula Daya Shatakam.
This kirtan is alamenga Rishi Lakshmi Hridaya Mastram Rishi Mantrasrashta Annama Charyu. Khandagati Padakavitha Chandam Srivenkateswara is the presiding deity. The sweet seed of devotion. Flirting is key. Spiritual Romantic Science Paripakam Shakti Alamelmanga Sahitha Srivenkateswara Prasada Rupa Rasasamrajya Prapya Rtham Japamu Use. Gana Bhinaya Taldruta Karanalu Anganyasa Karanyasalu, Annamacharya Padaganapriya Hari Padakamalakanti Dhyana, Dhatumatu Repetition.

Discover more from CHILCH

Subscribe to get the latest posts sent to your email.

Explore more

chilch.com

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026Revati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Rasi

Revati Nakshatra Pada 4 Female RasiRevati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the planet Mercury and...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Health

Revati Nakshatra Pada 4 Female HealthRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Compatibility

Revati Nakshatra Pada 4 Female CompatibilityRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Profession

Revati Nakshatra Pada 4 Female ProfessionRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Appearance

Revati Nakshatra Pada 4 Female AppearanceRevati Nakshatra is the last nakshatra of the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Names

Revati Nakshatra Pada 4 Female NamesAccording to Vedic astrology, the fourth pada of Revati Nakshatra is ruled by the planet Mercury. This pada is...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Celebrities

Revati Nakshatra Pada 4 Female CelebritiesRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...