annamayya sukthulu

 annamayya sukthulu
అన్నమయ్య
సూక్తులు

for reading in English please scroll down

1. చంచలమైన మనస్సుతో చదువుల సారాన్ని, శాస్త్ర రహస్యాలను చవిచూడలేరు.

2. ధనాన్ని దోచుకున్నవాడే కాదు, తనకున్న ధనాన్ని ఎటువంటి మంచి పనులకు వెచ్చించక దాచుకునేవాడు కూడా దొంగే.

3. మనిషికి నిజమైన శత్రువులు ఎక్కడో లేరు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే కనపడని అంతర్గత శత్రువులే మనిషికి నిజమైన శత్రువులు.

4. ఈ ప్రకృతిలో ఓ చిన్న చీమకైనా ప్రాణం పోయలేని మనిషి తోటి మనుషుల్ని, నోరులేని అమాయక జంతువుల్ని సంహరిస్తూ ఎందుకు ఇంత జీవహింసకు పాల్పడుతున్నాడు ?!

5. త్యాగధనులిచ్చే ఒక్క రూపాయైన, పేరు ప్రఖ్యాతులకోసం ధనవంతులిచ్చే కోటి రూపాయలకన్నా విలువైనది.

6. ఈ సృష్టిలో పాములు, పులులు మనం అనుకున్నంత ప్రమాదకరమైనవి కావు. మనుషులే కొందరు వీటికన్నా అత్యంత ప్రమాదకరంగా, క్రూరంగా ప్రవర్తిస్తుంటారు.

7. మనసా, వాచా, కర్మణా (త్రికరణశుద్ధిగా) చేసే పనులను దేవుడు మెచ్చుకుంటాడు, లోకమూ గుర్తిస్తుంది.

8. దేశాన్ని కేవలం సైన్యమే రక్షించలేదు. ధర్మం రక్షిస్తుంది. అయితే ధర్మాన్ని ప్రజలు, ప్రభువులు రక్షించినప్పుడు మాత్రమే (ఆచరించినప్పుడు మాత్రమే) ధర్మం వారిని రక్షిస్తుంది.

9. ఈ ప్రకృతిలో మనుషులు తమ కర్తవ్యాల్ని తాము సవ్యంగా నిర్వర్తిస్తే ప్రకృతికూడా తన పనుల్ని తాను సజావుగా చేసుకుంటుంది.

10. అగ్రకులం, అధమకులం అనేది కాని; రాజు గొప్ప, బంటు హీనుడని కాని; ఏనుగు విలువైనది, శునకం విలువలేనిదని కాని లేదు. అందరికీ ఒకే గాలి, ఒకే నీరు, ఒకే వెలుగు.

11. మనుషుడై పుట్టి ప్రయోజనం ఏమిటి ? జ్ఞానం లేకపోతే; హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి? దయ లేకపోతే; ధనికుడైతే ప్రయోజనం ఏమిటి ? దానం చేయకపోతే; చదివితే ప్రయోజనం ఏమిటి ? శాంతి లేకపోతే; మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ? ప్రియంగా మాట్లాడకపోతే, మనస్సుండి ప్రయోజనం ఏమిటి ? మాధవుడ్ని తలచకపోతే.

12. మొక్క మొదళ్ళని వదిలేసి కొనలకు నీళ్ళుపోస్తే ప్రయోజనం లేనట్లే ఎదలో వున్న పరమాత్మను వదిలి వేరే ఎక్కడో వెదకటం నిష్ప్రయోజనం.

13. కడలి (సముద్రం) అలలకు, మనస్సులోని కోరికలకు అంతం లేదు. అలలు నిలచిన తరువాత స్నానం చేయాలనుకోవడం, మనస్సు నిలకడ పొందిన తరువాత భగవంతుడి తత్త్వం తెలుసుకోవాలనుకోవడం – రెండూ అసాధ్యాలే.

14. కులం కన్న గుణమే ప్రధానం, ధర్మాన్ని ఆచరించటం, సత్యాన్ని పలకటం, పరుల హితాన్ని కోరుకోవటం, సమస్త జీవకోటిని ప్రేమించటం, ఆదుకోవటం, భక్తి- ఇవే భగవంతుని కులానికి ఉండాల్సిన గుణాలు.

15. నాస్తికత్వం అనే పేరుతో ఎదతలుపులు మూసుకున్న వారికి దైవతత్త్వం బోధపడదు.

16. పరుల పంచలో బ్రతికేవారి జీవితం కడురోత. పశువుగా, పక్షిగా చివరికి అడవిలో మృగంగా, మ్రానుగానైనా జీవించొచ్చు. కానీ పరదాస్యపు బ్రతుకు మాత్రం బ్రతకకూడదు.

17. సంప్రదాయమంటే తాతలు తవ్విన ఉప్పు బావిలోని నీటినే తరతరాలుగా త్రాగటం కాదు. నిన్నటి మంచిని రేపటికి కరదీపికగా తీసుకువెళ్ళటం.

18. సమాజంలో అవిద్య, అన్యాయం, దారిద్య్రం తాండవిస్తుండగా. పాలకులు వాటిని తొలగించాల్సింది పోయి సమాజాన్నే దోచుకోవడమా ?

19. లౌకిక సుఖాలకు మరిగిన పాలకులు ఆధ్యాత్మికపు కరవులో, అజ్ఞానపు కరవులో కొట్టుమిట్టాడుతున్నారు.

20. నేడు మనం చూస్తున్న కరవు కాటకాలు ప్రకృతి సృష్టించేవి మాత్రమే కావు. ఒక విధంగా ఇవి అజ్ఞానపు కరవులు. పాలకులు ముందుచూపులేక చేస్తున్న పనులకు, ప్రజలు అజ్ఞానంతో చేస్తున్న చర్యలకు ఫలితాలివి.

21. కాలగతియో, లోకం పోకడో కాని మంచి అడుగునపడి పోతోంది. నిజం కనుమరుగవుతోంది. ధర్మం తలక్రిందులవు తోంది. విజ్ఞానం, వివేకం లోపిస్తోంది. ఆచారం తడబడుతోంది, జాతి విలవిలలాడుతోంది.

22. మనుషులు మొక్కుబడుల పేరుతో తమకు ఇష్టమైన మద్య, మాంసాలను దేవుడికి నైవేద్యం పెడుతూ దైవతత్వాన్ని అపహాస్యం చేస్తూ తమను తాము మోసగించుకుంటున్నారు. మద్య, మాంసాలను దేవుడికి నైవేద్యం పెట్టడం వామాచార పద్ధతి. ఇటువంటి తామస పూజలు తగవు.

23. దైవ ధనాన్ని ప్రభువు ఆశిస్తే ఆ రాజ్య భవిష్యత్తు కడు దుర్భరం.

24. వెలుగుతున్న కర్పూరదీపాన్ని ఆర్పి, అది తమ మంత్రశక్తి అని చెప్పుకునేవారు అదే శక్తితో ఆరిపోయిన కర్పూరాన్ని తిరిగి వెలిగించగలరా ?

25. సమస్త జీవకోటికి తండ్రి శ్రీ వేంకటేశ్వరుడు, తల్లి అలమేలు మంగ. సర్వప్రాణి సేవే శ్రీనివాస సేవ.

26. జాతి భేదాలు శరీరానికి సంబంధించినవే ఆత్మ పరిశుద్ధమైనది. అది నాశనం లేనిది. ఏ దోషము అంటనిది. ధర్మమూలమైన పరతత్త్వజ్ఞానం, హరిని గురించిన విజ్ఞానం, విష్ణునామస్మరణ- ఇవే సుజాతికి మూలస్తంభాలు.

27. జీవ స్వరూపంతోపాటు దైవ స్వరూపాన్ని తెలుసుకోవడం, జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాలతో ఆచార్య విశ్వాసం వదలక శరణాగతి తత్త్వంతో శ్రీ వేంకటేశ్వరునికి సేవ చేయటమే బ్రహ్మానంద వేదాంత రహస్యం.

28. జానెడు పొట్ట, గుప్పెడు తిండి కోసం పడరాని పాట్లు పడుతూ, చేయరాని పనులు చేయడంకన్న ఈ భ్రాంతులను విడనాడి పరమాత్ముని సేవానిరతియందు మనస్సు లగ్నం చేయడం మేలు.

29. నడచి తిరుమలకొండ ఎక్కే ప్రతి భక్తుడు శ్రీ పదార్చన చేస్తున్నవాడే.

30. అందరికీ కర్తవ్యాన్ని ఉపదేశించవలసినవాడు శ్రీ వేంకటేశ్వరుడే.

31. జగన్నాధుడు మేలుకుంటే జగమంతా మేలుకుంటుంది. మన జీవితాలకు జగన్నాధుడైన శ్రీనివాసుని మేలకొలుపే రక్ష

32. ఈ భవబంధాలను తప్పించుకోవడమెలా? ఇంద్రియాలను అరికట్టడమెలా? ఆశాపాశాలను తొలగించుకోవడమెలా ? ఒకదానితో మరొకటి పెనవేసుకున్న ఈ లంకెల సంకెళ్ళ నుండి తప్పించుకునే సులువైన మార్గమెలా ? అని ఆలోచించే వారికి నిజమైన, సులువైన మార్గం ఒక్కటే అదే శ్రీ వేంకటేశ్వరుని శరణాగతి.

33. హరిభక్తులు నరహరిని తప్ప, ఏ నరపతిని ఆశ్రయింప పని లేదు. తలవంచనక్కరలేదు.

34. శ్రీ వేంకటేశ్వర సేవ అంటే సమస్త ప్రాణికోటిని సేవించడమే.

అంధులను, బధిరులను, పిచ్చివారిని సేవించడం ద్వారా శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులం కాగలం.

35. అందరికీ అభయాన్నిచ్చే బంగారు చేయి శ్రీ వేంకటేశుని చేయి.

36. అమ్మవారి జాతర్లలో జంతువులను బలి ఇవ్వటం మహాపచారం. సకల జీవులకు తల్లియైన అమ్మవారు తన బిడ్డలను తానే బలి కోరుకుంటుందా ?

37. ఈ లోకంలో జాతినిబట్టిగానీ, కులాన్నిబట్టి గానీ, ప్రాంతాన్ని బట్టిగానీ, రంగునుబట్టిగానీ, డబ్బును బట్టిగానీ వచ్చేది నిజమైన గొప్పదనం కాదు. ఏ జాతి, కుల, ప్రాంతం, వర్గం వారైనా భగవంతుని గురించి తెలుసుకుని మసలుకున్నవారే నిజమైన గొప్పవారు. వారి జీవితమే ధన్యం.

38. పుట్టడం నిజం, చనిపోవడం నిజం. ఈ రెండింటి మధ్య నడిచేది ఉత్త నాటకం. నాటకంలో వేదిక పైకి వచ్చి ఆడిపోయే పాత్రధారులే మానవులు. వీరిని ఆడించే సూత్రధారుడే శ్రీ వేంకటేశ్వరుడు.

39. మందు కాని మందు విష్ణు నామం. అది చిత్తశాంతికి మండు, ఇహపరాల్లో బలం చేకూర్చేది, భవరోగాలను రూపుమాపేది.

40. ఈ సృష్టి అశాశ్వతం, ఈ బ్రతుకు అబద్ధం అని తెలిసినా చంచలమైన మనస్సు పరిపరివిధాల మోహాలకు లోనవుతూ వంచనలకు, మాయలకు, నటనలకు గురవుతోంది. మనస్సుకు పట్టిన ఈ అజ్ఞానపు తెరలను తొలగించు కోకపోతే జీవికి ముక్తి లేదు.

41. ఇహలోక సౌఖ్యాలకోసం నరులను, నరపతులను నమ్మి మోసపోవడంకన్నా శాశ్వతమైన పరమాత్మ సాన్నిధ్యం కోసం భగవంతుడ్ని నమ్మండి, సేవించండి.

42. మొసలిబారినపడిన గజేంద్రుడిని తన సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి రక్షించినట్లే ఈ జగత్తనే కొలనులో మొసళ్ళనే కోరికల బారినపడి విలవిలలాడుతున్న మానవులకు రక్ష కూడా ఆ శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రమే.

43. ప్రకృతిని, ప్రాణికోటిని, తోటి మానవుల్ని ప్రేమించలేనివాడు ఎన్నటికీ భగవంతుడిని చేరలేడు.

44. పెదవులతో ప్రార్ధించడమే కాదు. చేతులతో చేతనైన సాయంకూడా చేయాలి.

సంకీర్తనా శక్తి

45. కృతయుగంలో ధ్యానం వలన, త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులవలన, ద్వాపరయుగంలో అర్చనవలన భగవంతుడ్ని

చేరుకోగలిగితే, కలియుగంలో సంకీర్తన ద్వారా కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడ్ని చేరుకోగలం.

46. సంకీర్తన మానవుని సత్కర్మకు దారి తీస్తోంది. సంకీర్తన, సత్కర్మ రైలు పట్టాల్లాంటివి. ఓ ప్రక్క సంకీర్తన మరోప్రక్క సత్కర్మ సమాంతరంగా సాగితేనే లోకకళ్యాణం.

47. కలియుగంలో భగవంతుడిని సంకీర్తనలతో పూజించాలని శాస్త్ర ప్రమాణం. సకల దుఃఖాలను రూపుమాపే హరినామ సంకీర్తనం సర్వశ్రేయస్కరం.

48. కలియుగంలో నామ మహాత్మ్యం చాలా గొప్పది. వేదాలు చేసిన పనికూడా ఇదే. సర్వమంగళ స్వరూపుడైన ఆ సర్వేశ్వరుడ్ని స్తుతించడమే సంకీర్తన లక్ష్యం.

49. సంకీర్తన అంటే అహింసా యోగం.

50. మానవులకు సంతాపాన్ని పోగొట్టి సంతోషాన్నిచ్చేది, జంతు జాలాన్ని రక్షించేది, ప్రకృతిని పరిరక్షించేది ఒకటేమిటి అన్నిటికీ దివ్యౌషధం సంకీర్తనం.

Sayings-Proverbs
1. One cannot experience the essence of studies and the mysteries of science with a restless mind.
2. Not only the one who steals money, but also the one who hides his money without spending it on any good works is a thief.
3. Man has no real enemies anywhere. The real enemies of man are the invisible internal enemies of lust, anger, greed, lust, religion and greed.
4. Why does a man who cannot give life to even a small ant in this nature commits so much violence by killing his fellow humans and speechless innocent animals?!
5. A single rupee given in sacrifice is worth more than a crore of rupees given by a rich man for fame.
6. In this creation, snakes and tigers are not as dangerous as we think. Some humans behave more dangerously and cruelly than these.
7. Deeds of Manasa, Vacha, Karmana (Trinity Purity) are appreciated by God and recognized by the world.
8. Army alone did not save the country. Dharma protects. But only when Dharma is protected (practiced) by the people and nobles, Dharma protects them.
9. If humans perform their duties properly in this nature, nature also performs its tasks properly.
10. Upper caste and lower caste are not; The king is great, but the pawn is inferior; An elephant is valuable and a dog is not worthless. One air, one water, one light for all.
11. What is the purpose of being born as a human being? If there is no knowledge; What’s the point of having a heart? If there is no mercy; What is the benefit of being rich? If not donated; What is the purpose of reading? If there is no peace; What is the purpose of talking? If you don’t speak kindly, what’s the point of thinking? If you don’t think of Madhawood.
12. Just as it is useless to leave the roots of a plant and water the tips, it is useless to leave the Supreme Being and look for it somewhere else.
13. There is no end to the waves of the ocean and the desires of the mind. Wanting to take a bath after the waves have stopped, wanting to know God’s philosophy after the mind is stable – both are impossible.
14. The quality of the caste is the most important, practicing righteousness, telling the truth, seeking the welfare of others, loving and supporting all living beings, devotion – these are the qualities that God’s caste should have.
15. Divinity cannot be taught to those who have closed their doors under the name of atheism.
16. The life of those living in Parula Pancha is miserable. You can live as a cattle, a bird and finally as a beast or a beast in the forest. But the life of paradise should not be lived.
17. Tradition does not mean drinking the water from the salt well dug by the grandfathers for generations. Carrying the good of yesterday to tomorrow.
12
18. While illiteracy, injustice and poverty prevail in the society. Should the rulers remove them and rob the society?
19. Rulers who are addicted to worldly pleasures are languishing in spiritual hunger and ignorance.
20. The droughts we are witnessing today are not only created by nature. In a way these are famines of ignorance. These are the results of actions taken by rulers without foresight and actions taken by people in ignorance.
21. Time passes, the world passes away, but the good is passing away. The truth is disappearing. Dharma is upside down. Lack of knowledge and wisdom. Ritual is faltering, race is faltering.
22. Men are deceiving themselves by mocking the divinity by offering their favorite liquors and meats to God in the name of offerings. Vamachara practice is to offer alcohol and meat to God. Such tamasa pujas are not suitable.
23. If the Lord expects divine wealth, the future of that kingdom is dire.
24. Can those who put out a burning camphor lamp and claim that it is their mantrashakti relight the extinguished camphor with the same power?
25. Sri Venkateswara is the father of all living creatures and Alamelu Manga is the mother. Sarvaprani seva is Srinivasa seva.
26. Racial differences are related to the body but the soul is pure. It is indestructible. There is no error. Knowledge of Paratattva which is the source of Dharma, knowledge of Harini, remembrance of Vishnu name – these are the cornerstones of Sujati.
27. The secret of Brahmananda Vedanta is to know the nature of life as well as the nature of God, to serve Sri Venkateswara with knowledge, devotion and dispassion, and to serve Sri Venkateswara with the faith of Acharya and surrender.
28. It is better to let go of these illusions of empty stomach and mouthfuls of food, and of doing impossible things and engage the mind in the service of the Supreme Lord.
29. Every devotee who walks and climbs Tirumalakonda is doing Sri Padarchana.
30. It is Sri Venkateswara who should instruct everyone about duty.
31. If Jagannadha wakes up, the whole world will wake up. Lord Jagannadha’s awakening raksha for our lives
32. How to avoid these situations? What about restraining the senses? How to remove hopes? From these interlocking chains of links
What is the easiest way to escape? For those who think that the only real and easy way is to surrender to Sri Venkateswara.
33. Devotees of Hari should not take refuge in any Narapati except Narahari. Do not be fooled.
34. To serve Sri Venkateswara means to serve all living beings.
By serving the blind, the deaf and the insane, we can earn the grace of Lord Venkateswara.
35. The golden hand that gives protection to all is the hand of Shri Venkatesh.
36. Sacrifice of animals in the fairs of Ammavari is a great event. Amma who is the mother of all living beings wants to sacrifice her own children?
37. In this world there is no true greatness that comes by race, by caste, by region, by color or by money. No matter what race, caste, region or class they are, those who know God and rest are truly great. Their lives are blessed.
38. To be born is true, to die is true. A new drama runs between these two. Humans are the characters who come up on the stage and play. Sri Venkateswara is the mastermind who plays them.
39. Vishnu’s name is the medicine that is not medicine. It is a fire for peace of mind, gives strength to the mind and cures ailments.
40. Knowing that this creation is impermanent and this life is a lie, the fickle mind succumbs to the temptations of the surroundings and is exposed to deceptions, illusions and acts. If these veils of ignorance are not removed from the mind, there is no salvation for the living being.
41. Believe and serve God for eternal closeness to God rather than being deceived by men and women for the comforts of this world.
42. Just as Lord Vishnu saved Gajendra who was attacked by a crocodile with his Sudarshana Chakra, the Sudarshana Chakra of Srimannarayana is the protection of human beings who are languishing in the pool of this world because of the desires of crocodiles.
43. He who cannot love nature, animals and fellow human beings can never reach God.
44. Not just praying with the lips. Conscious assistance should also be done with hands.
Sankirtana Shakti
45. In Krita Yuga by meditation, in Treta Yuga by Yajna and Yagadu, in Dwapara Yuga by Archana.
If we can reach, we can reach Sri Venkateswara, the god of Kali Yuga, through sankirtana in Kali Yuga.
46. ​​Sankirtana leads to man’s good deeds. Sankirtana and Satkarma are like train tracks. Lokalyana is only if good deeds on one side go parallel to one another.
47. In Kali Yuga it is a Shastra oath that the Lord should be worshiped with Sankirtans. Harinama Sankirtan is the most auspicious to remove all sorrows.
48. Nama Mahatmya is very great in Kali Yuga. This is also what the Vedas did. The aim of Sankirtana is to praise that Lord who is the embodiment of all blessings.
49. Sankirtana means non-violent yoga.
50. The panacea for all things, which relieves sorrow and gives happiness to human beings, saves the animal world, preserves nature, is one and the same.

Discover more from CHILCH

Subscribe to get the latest posts sent to your email.

Explore more

chilch.com

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026Revati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Rasi

Revati Nakshatra Pada 4 Female RasiRevati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the planet Mercury and...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Health

Revati Nakshatra Pada 4 Female HealthRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Compatibility

Revati Nakshatra Pada 4 Female CompatibilityRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Profession

Revati Nakshatra Pada 4 Female ProfessionRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Appearance

Revati Nakshatra Pada 4 Female AppearanceRevati Nakshatra is the last nakshatra of the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Names

Revati Nakshatra Pada 4 Female NamesAccording to Vedic astrology, the fourth pada of Revati Nakshatra is ruled by the planet Mercury. This pada is...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Celebrities

Revati Nakshatra Pada 4 Female CelebritiesRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...